కవిత చేసిన సాయం జీవితాంతం మరిచిపోలేం

KAVITAతనలో ఉన్న సేవా గుణాన్ని మరోసారి చూపించారు ఎంపీ కవిత. ప్రమాదవ శాత్తు మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి ఆమె అండగా నిలిచారు. అన్నీ తానే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బినోల గ్రామ సర్పంచ్ మోచి బాలరాజు ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి 2016, మార్చి 12న చనిపోయాడు. ఆర్ధిక స్ధోమత లేని ఆ కుటుంబానికి అండగా నిలబడి దగ్గరుండి బాలరాజు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంత్యక్రియల ఏర్పాటు అయిన ఖర్చు మొత్తం కవితే భరించారు. బాలరాజు కూతురు భారతికి నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్నారు. భారతి వివాహం మార్చి నెలలో ఉండటంతో.. పెళ్లి ఖర్చుల కోసం.. కవిత రూ. 3 లక్షల నగదును ఇచ్చారు. ఈ నగదును అధికారులు భారతికి ఈ రోజు(మంగళవారం-6) అందజేశారు. ఎంపీ కవితకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు భారతి, ఆమె తల్లి.

Posted in Uncategorized

Latest Updates