కశ్మీర్‌ ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాదితో పాటు ముగ్గురు మృతి

జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో ఓ ఉగ్రవాదితో పాటు ముగ్గురు మృతి చెందారు. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాను, మరో సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే ఉగ్రవాదిని కూడా బలగాలు మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌లోని దూరు షాహాబాద్‌లో, నూర్‌బాగ్‌లో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates