కశ్మీర్ లో ఉగ్రదాడి : ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

kashmirకశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు మృతి చెందారు. బద్గామ్ జిల్లా పరిధిలోని చరారే షరీఫ్ దర్గా వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కుల్తార్ సింగ్‌పై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. తీవ్రంగా గాయపడిన కుల్తార్‌సింగ్.. దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలోని హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫజల్ హక్ ఖురేషీ నివాసం బయట గల పోలీస్ పోస్టుపైనా మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో అక్కడిక్కడే కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ వార్త తెలియగానే మిలిటెంట్లను పట్టుకునేందుకు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసతున్నారు పోలీసులు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు అమరులు కావడంపై డీజీపీ వైద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మనం పాకిస్థాన్‌తో పరోక్ష యుద్ధం చేస్తున్నాం. పోలీసు జవాన్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి అని సూచించారు ఆయన.

సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాక్

జమ్ముకశ్మీర్‌లోని రాజోరి జిల్లాలో ఆదివారం పాక్ మళ్లీ కాల్పులకు తెగబడింది. రెండు గంటలపాటు ఇరువైపులా భారీగా కాల్పులు జరిగాయి. అయితే ఎవరికీ ప్రాణహాని జరుగలేదన్నారు అధికారులు. గత పదినెలలుగా నియంత్రణరేఖ (ఎల్వోసీ) వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు మృత్యువాత పడగా, మరో 13మంది గాయపడ్డారు. 2017 మార్చి ఒకటి నుంచి 2018 ఫిబ్రవరి 25 వరకు పాక్ జరిపిన కాల్పుల్లో 169 ఇండ్లు, 12 ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు రాజౌరి జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి.

Posted in Uncategorized

Latest Updates