కసాయి తండ్రి : భార్య వేరొకరితో వెళ్లిపోయిందని…పిల్లలను దారుణంగా చంపేశాడు

ఏపీలోని కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య వదిలి వెళ్లడంతో…మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను దారుణంగా… గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. జిల్లాలోని జూపాడు బంగ్లాలో ఈ దారణ ఘటన జరిగింది.
నిందితుడు ధనోజీరావుకి ఝాన్సీ లక్ష్మీబాయితో పదేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి లిఖిత (7), మధు (4) అనే ఇద్దరు పిల్లలున్నారు. ఝూన్సీ లక్ష్మీబాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఝాన్సీ భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన ధనోజీరావు సోమవారం తెల్లవారుజామున పిల్లలిద్దరినీ గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates