కస్టమర్ల ప్రయోజనాలు పట్టవా : నెంబర్ పోర్టబులిటీ ఇక నుంచి కష్టం

portabilytyసిగ్నల్స్ సరిగా లేక పోయినా.. ఆయా సంస్థలు అందించే సర్వీలు నచ్చకపోయినా.. ఆఫర్స్ ఏ టెలికాం సంస్థ ఎక్కువగా ఇస్తుందో దానికి వెంటనే మారిపోతున్నారు వినియోగదారులు. అది కూడా మొబైల్ నెంబర్ మార్చుకోకుండా.. నంబర్ పోర్టబులిటీ(MNP) ద్వారా ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు మారేవారు. ఇకపై అలా మారే అవకాశాన్ని అరికట్టేందుకు.. మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవలను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టనున్నాయి ఇంటర్ కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు. MNP  సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేయనున్నాయని ఓ పత్రిక రిపోర్టు చేసింది.

ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం MNP  ఫీజులను ట్రాయ్‌ రూ.19 నుంచి 4 రూపాయలకు తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి MNP  సేవలు నిలిపివేస్తామని తెలిపాయి. ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సర్వీసులను నిలిపివేస్తే.. వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం ఇక అంత సులువు కాదు.

వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు.. కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం MNP  విధానాన్ని ప్రవేశపెట్టింది. జియో రాకతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడ్డాయి. ఒక్క మార్చి నెలలో మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ అభ్యర్థనలు 19.67 మిలియన్లకు పెరిగాయి.

Posted in Uncategorized

Latest Updates