కస్తూర్బా స్కూల్స్ లో ఇంటర్మీడియట్

బాలిక విద్యను ప్రోత్సహించేందుకు …వారికి ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2004 సంవత్సరంలో మండలానికి ఒకటి చొప్పున కస్తూర్బాగాంధీ విద్యాలయాలను(KGBV) ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యనభ్యసించేందుకు మాత్రమద్రం అనుమతి ఇచ్చింది.

దీనికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం హయాంలోనే వీటిలో 9, 10వ తరగతుల పొడిగించి సొంత నిధులతో నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9, 10వ తరగతులతో పాటు ఇంటర్‌కు కూడా కేంద్ర నిధులు అందనున్నాయి. ఇంటర్ విద్యను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్ కమిటీ సిపార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నది.

KGBV ల్లో ఇంటర్ వరకు పొడిగించాలని మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ క్రమంలో బాలిక విద్యను ప్రోత్సహించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని చైర్మన్‌గా ఉప సంఘాన్ని నియమించారు. కడియం 2018 జనవరి 16న కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించారు. నివేదికలో ముఖ్యంగా KGBV ల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రధానంగా ప్రస్తావించారు.

దేశ వ్యాప్తంగా 3,703 KGBV లు ఉండగా అందులో తెలంగాణలోనే అత్యధికంగా 475 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటివరకు 9, 10 తరగతులకు రాష్ట్రాలే నిధులు భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ వరకు పెంచడంతో రాష్ట్రాలకు భారం తగ్గనున్నది. దీంతో రాష్ట్రంలో 38 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.

Posted in Uncategorized

Latest Updates