కాంగ్రెస్‌కు వాంగ్మూలం ఇచ్చిన జుకర్‌బర్గ్‌

mark zuckerbergకోట్లాది మంది ప్రైవేట్‌ డేటా దుర్వినియోగంపై ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. ‘’అది నా తప్పే. అందుకు నా క్షమాపణలు. ఫేస్‌బుక్‌ను నేనే ప్రారంభించాను. నేనే నడుపుతున్నాను. ఇక్కడ జరుగుతున్నదానికి నాదే బాధ్యత.’’ అని అన్నారు జుకర్ బర్గ్. జరిగిన తప్పులకు పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు ఫేస్‌బుక్‌ చీఫ్. భద్రత అంశంలో ఫేస్‌బుక్‌ భారీగా పెట్టే పెట్టుబడుల వల్ల సంస్థ లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. సంస్థలో 15వేల మంది భద్రత, కంటెంట్‌ సమీక్షపై పని చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ సంఖ్య 20వేలకు చేరుతుంది. లాభాలను గరిష్ఠం చేసుకోవడం కన్నా మన సమాజాన్ని రక్షించుకోవడమే ముఖ్యం అని కాంగ్రెస్‌ సభ్యులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఆయన. ఈమేరకు రేపు(బుధవారం) హౌస్‌ ఆఫ్‌ ప్యానల్‌ ముందు కూడా ఆయన వాంగ్మూలం ఇవ్వనున్నాడు.

Posted in Uncategorized

Latest Updates