కాంగ్రెస్‌లో చేరిన జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ మాజీ సీనియర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు, రాజస్థాన్‌లోని షియో నియోజకవర్గ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్‌ కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి ఆ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. మన్వేంద్ర పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్‌ నేతలు స్వాగతించారు. అయితే.. మన్వేంద్ర సింగ్‌ బీజేపీ నుంచి వెళ్లిపోవడం.. పార్టీకి నష్టమేమీ లేదని… ఎన్నికలపై ఎటువంటి ఎఫెక్ట్ చూపదన్నారు రాజస్థాన్‌ మంత్రి రాజేంద్ర రాథోర్‌. డిసెంబరు 7న పోలింగ్‌ నిర్వహించనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

మన్వేంద్ర గతనెల 22న బీజేపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో చేరడం తాను చేసిన పెద్ద తప్పని చెప్పారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన జశ్వంత్‌ సింగ్‌ కుమారుడే మన్వేంద్ర సింగ్‌. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో జశ్వంత్‌ సింగ్‌ రక్షణశాఖ, విదేశాంగశాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వర్తించారు.

 

Posted in Uncategorized

Latest Updates