కాంగ్రెస్ కు ఊహించని విషాదం..రోడ్డు ప్రమాదంలో కర్ణాటక MLA మృతి

SIDDU BEEMAPPA DEADకర్ణాటక కాంగ్రెస్ కు ఊహించని విషాదం ఎదురైంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సోమవారం (మే-28) ఉదయం కర్ణాటకలోని జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. గోవా నుంచి బాగల్‌ కోట్‌ కు వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. జంఖండి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన భీమప్పకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోన్నవేళ ఆయన మరణవార్త అభిమానులను, కుటుంబసభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రమే గౌడ అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.

Posted in Uncategorized

Latest Updates