కాంగ్రెస్ కు ఓటేస్తే పేదవారికి ఏటా రూ.72వేలు: కోదండరాం

జనగామ జిల్లాలో భువనగిరి లోక్ సభ పరిధిలో ప్రచారం చేశారు కాంగ్రెస్, టీజేఎస్ నాయకులు. తెలంగాణ కోసం ఇదే జనగామ చౌరస్తాలో పోరాటం చేశాం.. జనగామ జిల్లా కోసం పోరాటం ఇక్కడే అని గుర్తుచేశారు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం. కాంగ్రెస్ నేతృత్వంలో కూటమిగా పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

కేసీఆర్ నియంత పాలనను అంతమొందించడానికి మరో ఉద్యమానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు కోదండరామ్. ప్రజల బ్రతుకులు బాగుకోసమే ఓటు వేయాలని అన్నారు. కేసీఆర్ కు ఓటేసినా.. మోడీకి వేసినట్టు అవుతుందని చెప్పారు కోదండరామ్. పంటలకు గిట్టుబాటులేక వ్యవసాయం గుదిబండగా మారిందన్నారు కోదండరామ్. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని… ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు రూ.6వేలు అందుతుందని చెప్పారు. ఏడాదికి రూ.72వేలు అందుతుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పని చేసిన వాళ్లను పక్కకు పెట్టి, ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకుని.. కేసీఆర్ వారికే టికెట్లు ఇచ్చారని కోదండరామ్ విమర్శించారు.

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఎంపీగా కోమటిరెడ్డిని గెలిపిస్తేనే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని చెప్పారు.

Latest Updates