కాంగ్రెస్ కు కేడర్ లేదు.. టీడీపీకి లీడర్ లేడు.. కేటీఆర్ విసుర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా : “కాంగ్రెస్, తెలుగుదేశం ఒక్కటై కేసీఆర్ ను గద్దెదించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ లో ఎవరికీ గ్యారెంటీ లేదు.. సీఎం అభ్యర్థులే ముప్పై మంది ఉన్నారు. 67 ఏళ్ల చరిత్రలో రూ. 200 పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ నేతలు.. ఇపుడు 2000 అంటూ పెద్దపెద్ద మాటలు ఎలా చెబుతున్నారు” అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. శాంతి నగర్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హామీలివ్వడంలో… కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయని… పెళ్లికాని పిల్లలను వెతికి మనీ.. పెళ్లిళ్లు చేసే బాధ్యత తీసుకుంటారేమోనని అన్నారు. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ కారు,  కాంగ్రెస్ వాళ్లకు క్యాడర్ లేరు, టీడీపీ వాళ్లకు లీడర్ లేడు అని అన్నారు కేటీఆర్.

బీడీ కార్మికులకు అపారెల్ పార్క్ లో ఉద్యోగాలు

రాష్ట్రంలో సిరిసిల్లను రోల్ మోడల్ పట్టణంగా మార్చుతున్నామన్నారు. మూడేళ్లలో సిరిసిల్లకు రైలొస్తుందన్నారు. బీడీలు చుట్టి ఆరోగ్యం పాడుచేసుకునే అవసరం ఇక లేదని… అపారెల్ పార్కులో వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి… పది , పన్నెండు వేల రూపాయల జీతమిచ్చి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటుచేస్తున్నామన్నారు. వచ్చే దీపావళి నాటికి సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఇంటిటింటికి నల్లా నీరు అందుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates