కాంగ్రెస్ కు షాక్ : TRSలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం

హైదరాబాద్ : కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ మండలి సెక్రటరీ బులిటెన్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ కు చెందిన నలుగురు MLCలు ఉదయం స్వామిగౌడ్ ను కలిసి తమను TRS ఎల్పీలో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. తర్వాత.. పీసీసీ చీఫ్ ఉత్తమ్.. షబ్బీర్ అలీలు మండలి ఛైర్మన్ ను కలిసి.. జాతీయ పార్టీకి విలీనం వర్తించదని చెప్పారు. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించిన స్వామిగౌడ్ కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దాంతో కాంగ్రెస్ కు చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్, M.S. ప్రభాకర్ రావు, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డిని ఇకపై టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్టు స్వామి గౌడ్ ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates