కాంగ్రెస్ కు షాక్: TRS లో మండలి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేయండి

మండలిలో రాజకీయ పరిణామాలు చకచక మారుతున్నాయి, మండలిలో కాంగ్రెస్ ఎల్పీని….TRS లో విలీనం చేయాలని కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్‌ కు శుక్రవారం లేఖ సమర్పించారు నలుగురు కాంగ్రెస్ MLCలు. లేఖపై కూచకుళ్ళ దామోదర్ రెడ్డి, MS ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్….సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే TRSలో MS ప్రభాకర్, కూచకుళ్ల దామోదర్ చేరగా….నిన్న(గురువారం) సాయంత్రం సంతోష్ తో పాటు లలిత…. CM కేసీఆర్ ను కలిశారు. మండలి పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల బలం కేవలం రెండుకు చేరే అవకాశముంది. మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున షబ్బీర్ అలీ తో పాటు పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే మార్చి లో వీరిద్దరి పదవి కాలం కూడా ముగుస్తోంది.

మండలిలో కాంగ్రెస్‌కు 7గురు సభ్యులు ఉండగా.. ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 40 మంది ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష హోదాకు కనీసం నలుగురు సభ్యులు అవసరం. కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలితే ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates