కాంగ్రెస్ కే డిప్యూటీ సీఎం పదవి

JDS-Congressఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనకు నిన్నటితో(శనివారం) తెరపడింది. ఈ క్రమంలో పదవుల పంపకంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు దృష్టి సారించాయి. JDS ఎమ్మెల్యే  కుమారస్వామి సీఎం పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడంతో.. డిప్యూటీ సీఎం ఏ పార్టీ వారికి ఇవ్వాలన్న దానిపై చర్చగా మారింది.

డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవికి కాంగ్రెస్‌కు ఇవ్వాలని ఆ పార్టీ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్‌కే ఇవ్వాలని JDS నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే హోంమంత్రి పదవిపై మాత్రం సందిగ్ధత కొనసాగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. పరమేశ్వర.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి 20 మంది… జేడీఎస్ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. వీరి ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ నెల 23న జరగనుంది. కుమారస్వామి రేపు (సోమవారం, మే-21) ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని కలవనున్నారు.

Posted in Uncategorized

Latest Updates