కాంగ్రెస్ నుంచి ఓ ఎమ్మెల్యే జంప్ : కేరళకు క్యాంప్ షిఫ్టింగ్

congress-mlaయడ్యూరప్ప సీఎం అయిన వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. ఇప్పటికే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ యడ్డీకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్, జేడీఎస్ మరింత అప్రమత్తం అయ్యాయి. మిగతా ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్ధితుల్లో జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం బెంగళూరు శివార్లలో ఉన్న రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలను మార్చాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉండటం సేఫ్ కాదని, వారిని వెంటనే కేరళ రాష్ట్రానికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. కేరళలో అయితే ఎమ్మెల్యేలను కాపాడుకోవటం ఈజీ అనుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొందరు మాత్రం ఏపీకి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారు .జేడీఎస్ మాత్రం కేరళకు వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.  37 మంది ఎమ్మెల్యేలను బస్సుతో తీసుకెళ్లాలా.. లేక విమానంలో షిఫ్ట్ చేయాలా అనే ఆలోచన కూడా చేస్తోంది.

ప్రస్తుతం ఎమ్మెల్యేలను రక్షించుకోవడమే తమ ప్లాన్ అని కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను మోడీ ప్రభుత్వం భయపెడుతుందన్నారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు ఫోన్ చేశారని చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై ఈడీని ప్రయోగిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. అతనిపై పాత కేసులు బయటకు తీస్తామని భయపెడుతుండటంతో.. తనను తాను రక్షించుకునేందుకు బీజేపీలోకి వెళ్తున్నానని ఆనంద్ సింగ్ చెప్పారని కుమారస్వామి చెప్పారు. ఆ ఎమ్మెల్యేనే తనకు ఫోన్ చేసి చెప్పినట్లు కుమారస్వామి వివరించారు. నిన్నటికి నిన్న బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేస్తుందంటూ బాంబ్ పేల్చిన కుమారస్వామి.. ఇవాళ కేసుల విషయం ప్రస్తావనకు తీసుకురావటంతో కర్నాటకలో కలకలం రేపుతోంది.

Posted in Uncategorized

Latest Updates