కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు: శ్రవణ్

sravanతన సోషల్  మీడియా అకౌంట్లను  హ్యాక్ చేశారని హైదరాబాద్  సైబర్ క్రైం  పోలీసులకు  ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్.  కాంగ్రెస్ లో  బీసీలకు  అన్యాయం జరుగుతోందని..  అందుకే పార్టీ  వీడుతున్నానని  తన ట్విట్టర్ అకౌంట్లో    పోస్టు సృష్టించారన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.   శ్రవణ్ వెంట   సీసీఎస్ కు  వెళ్లిన మాజీ  ఎంపీ అంజన్ కుమార్.. కాంగ్రెస్ లో  శ్రవణ్ ఎదుగుతున్నారని..  అందుకే తప్పుడు  ప్రచారం  చేస్తున్నారన్నారు.

Posted in Uncategorized

Latest Updates