కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారు: హరీశ్

harish-raoకల్వకుర్తి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. భూసేకరణ చెల్లింపులు, ఆర్ అండ్ ఆర్ పనులకు అవసరమైన నిదులు విడుదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా కొల్లాపూర్, వీపనగండ్ల, నాగర్ కర్నూల్ లో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి అధికారులతో సమీక్ష చేశారు.

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు మంత్రి హరీశ్. కాంగ్రెస్ లో పదవుల కోసం కుర్చీలాట మొదలైందని విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా వీపనగండ్ల, పానగల్ లో 6 కోట్లతో నిర్మించిన వ్యవసాయ గోదాములను మంత్రి ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

తర్వాత పెద్దమందాడి మండలం బలిజపల్లి, జంగమాయిపల్లి జంట గ్రామాల్లో నిర్మించిన షిరిడీ సాయి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు. అంతకుముందు కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. KLI  ప్రధాన కాలువ వెంట ఎల్లూర్ రిజర్వాయర్ వరకు నిర్మించే.. బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి.. KLI కాలువను పరిశీలించారు.  నాగర్  కర్నూల్ లోని కేసరి సముద్రం చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. చెరువును మినీట్యాంక్ బండ్ లా తీర్చిదిద్దేందుకు పదికోట్లు మంజూరు చేశామన్నారు. అన్ని పట్టణాలల్లో మినీట్యాంక్ బండ్ లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు

Posted in Uncategorized

Latest Updates