కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారు: హరీశ్

harishకాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక.. ప్రజలు కష్టాలు పడ్డారన్నారు మంత్రి హరీశ్ రావు. సోమవారం(జులై-2) మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పదర మండలం మాధవానిపల్లిలో రూ.1.55 కోట్లతో నిర్మించిన విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత అమ్రాబాద్‌లో మార్కెట్ గోదాం, స్త్రీశక్తి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన ప్రగతి సభలో మాట్లాడారు.

టీఆర్ఎస్ పాలనలో 24గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.డిండి ఎత్తిపోతల పథకం ద్వారా అమ్రాబాద్, పదర మండలాలకు నీరందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బల్మూరు దగ్గర 2.5 TMC ల రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. బల్మూరు నుంచి గ్రావిటీ ద్వారా చంద్రసాగర్‌కు నీరు మళ్లిస్తామన్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి హరీశ్.

Posted in Uncategorized

Latest Updates