కాంగ్రెస్ పాలన అంతా అవినీతి మయం : కేటీఆర్

KTRకాంగ్రెస్ పాలన అంతా అవినీతి మయం అన్నారు మంత్రి కేటీఆర్. నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో  జనానికి తెలుసన్నారు. కాంగ్రెస్ నేతలు పుక్కిటి పురాణం చెబుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్రం వచ్చినప్పుడే కాంగ్రెస్ ను రద్దుచేయాలని గాంధీ చెప్పారన్నారు. అయినా దేశాన్ని విభజించి కాంగ్రెస్ స్వార్థంతో పాలించిందని ఆరోపించారు కేటీఆర్.

మంగళవారం (ఏప్రిల్-3) మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంభించారు. వార్డు ఎంపవర్ మెంట్ సెంటర్ కు శంకుస్థాపన చేసి… స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను మొదలుపెట్టారు. కొత్తగూడెం నుంచి పాల్వంచ వెళ్లే దారిలో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు. తర్వాత ప్రగతి మైదాన్ లో బహిరంగ సభకు హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates