కాంగ్రెస్ రెండు వేల పింఛన్ అనడమే టీఆర్ఎస్ విజయం : కేసీఆర్

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి TRSకి విజయాన్ని అందించిందన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ (అక్టోబర్-3) నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ ఆత్మగౌరవ జెండాను నిజామాబాద్ జిల్లా ఎగరవేసిందన్నారు. TRS అధికారంలోకి రాగానే సర్కార్ ముందు అనేక సవాళ్లు, సంక్షోభాలు ఉన్నాయన్నారు. గులాబీ జెండా చేతిలో పట్టుకున్న నిజామాబాద్ కు 24 గంటల నిరంతర కరెంటును సాధించుకున్నామని తెలిపారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు మంచినీళ్ల కటకట నుంచి విముక్తి కలిగేలా మిషన్ భగీరథను తీసుకువస్తున్నామన్నారు. 12వేల అడ్డంకులను దాటిన మిషన్ భగీరథ నీరు ఇంటింటికి చేరాయని తెలిపారు.

బీడీకార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధుల పించన్లను పెంచామని చెప్పారు.  పింఛన్ల మీద కాంగ్రెస్ పార్టీ అర్రాస్ వేలంపాట పాడుతోందన్నారు కేసీఆర్. తాము వెయ్యి అంటే రెండు వేలు.. రెండు వేలంటే మూడు వేలు చెబుతోందన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఎన్నడూ వంద, రెండు వందల పింఛన్ దాటని కాంగ్రెస్ నాయకులు… ఇపుడు రెండు వేల మాట మాట్లాడటమే తెలంగాణ గులాబీ జెండా సాధించిన విజయం అన్నారు.  మీకు బుద్ధి వచ్చినందుకు సంతోషం అన్నారు. టీఆర్ఎస్ కూడా త్వరలోనే పింఛన్లను పెంచడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎంత పెంచుతామన్నది మేనిఫెస్టో కమిటీలో వివరిస్తామన్నారు.

అనేకమైన సంక్షేమ పథకాలు తీసకువస్తున్నామని తెలిపిన ఆయన..కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని కార్యక్రమాలను తీసుకువచ్చి మహిళల కళ్లలో సంతోషాన్ని నింపామన్నారు. ముసలోల్లు కేసీఆర్ మా పెద్ద కొడుకని చెప్తున్నారంటే..వారి దీవెనలతోనే మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్లారు. కానీ వ్యవసాయంపై కన్నెత్తి చూసిన పాపన పోలేదన్నారు. 24 గంటల కరెంటు ..దేశంలోనే చరిత్ర సృష్టించామని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా పెండిగ్ లో ఉన్న పట్టాబుక్కులను రైతులకు అందించామన్నారు. పదవులను TRS పార్టీ ఎడమకాలి చెప్పులా పారేశామని చెప్పిన కేసీఆర్..ముందస్తుకు పోతే ప్రతి పక్షాలు కిందమీదపడి గిలగిల కొట్టుకుంటున్నారని..గోడలుగీకి కండ్లు చీకటైనయన్నారు. సుప్రీంలో కేసు..ఎలక్షన్ కమిషన్ కు కేసులంటూ కాంగ్రెస్ నానా రచ్చ చేసిందన్నారు.

రైతులకు పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ అన్నారు. రైతు చనిపోతే..రూ.6లక్షలు ఇస్తున్నామని..ప్రాజెక్టులు, రుణమాఫీ, వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు, వరినాటు మిషన్లను సబ్సిడీ మీద ఇస్తూ అన్నదతలకు అండగా నిలుస్తుందన్నారు. కోటీ ఎకరాలకు నీళ్లు తేవడమే కేసీఆర్ లక్ష్యం అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా రైతుల కోసం అన్ని పార్టీలు ఏకంకావడం తెలుసు కానీ..తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులకు అడ్డంకిగా మారుతున్నట్లు చెప్పారు కేసీఆర్. కంటి వెలుగుతో ఎంతో మందికి ట్రీట్ మెంట్ అందిస్తున్నామని..త్వరలోనే ENT ట్రీట్ మెంట్ అందిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉర్కటోని కాళ్లల్ల కట్టెపెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి అండంగా తయారైందన్నారు. 24 గంటల కరెంటు తెచ్చినా..మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నా..కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకువస్తానని తెలిపారు. కాంగ్రెస్ వి సొల్లు పురాణాలు అని..ప్రజలే సమాధానం చెప్తారన్నారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates