కాంగ్రెస్ లీడర్ హల్ చల్ : పెట్రోల్ పోసి తగలపెట్టేస్తా

naraనా డాక్యుమెంట్లపై సంతకాలు చేయకపోతే మీపై పెట్రోల్ పోస్తా.. తగలపెట్టేస్తా.. మీ అంతు చూస్తా అంటూ బెదిరించాడు ఓ కాంగ్రెస్ లీడర్. ఎవర్నో తెలుసా.. ప్రభుత్వ ఆఫీస్ లోని అధికారులను. కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన ఈ ఘటన సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ సన్నిహితుడు నారాయణస్వామి. బెంగళూరు కేఆర్ పురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు. హోరమావులోని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) వార్డు కార్యాలయానికి వెళ్లారు. భూములకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలంటూ అధికారులను అడిగారు. అవి నకిలీవి కావడంతో అధికారులు నిరాకరించారు. అధికార పార్టీ లీడర్ అడిగితేనే చేయరా అంటూ వీరంగం చేశారు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ బాటిల్ ను ఆఫీస్ లో చల్లారు. తగలపెట్టేస్తా.. అందరూ చస్తారు అంటూ బెదిరించాడు. అసిస్టెంట్ రెవెన్యూ అధికారిపై ఏకంగా పెట్రోల్ చల్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఫిబ్రవరి 20 బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రభుత్వ అధికారులకే రక్షణ లేకపోతే ఇంక సామాన్య ప్రజల పరిస్ధితి ఏంటంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ వీడియో బయటకు రావడంతో కర్నాటక కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ లోకి దిగింది. బీజేపీ దీన్ని హైలెట్ చేస్తుండటంతో ఇరకాటంలో పడింది.

Posted in Uncategorized

Latest Updates