కాంగ్రెస్ లో గ్రేటర్ చిచ్చు : అజారుద్దీన్ పై అంజన్ తిరుగుబాటు

ఎన్నికలు మరో ఏడాది ఉండగానే.. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల లొల్లి స్టార్ట్ అయ్యింది. గ్రేటర్ కాంగ్రెస్ మాటల యుద్ధం ఫైటింగ్ వరకు వెళ్లింది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తానంటూ ఆ పార్టీ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ చేసిన కామెంట్స్ వివాదం రేపుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ స్థానంపై AICC కార్యదర్శి రివ్యూ మీటింగ్ లో అజార్ చేసిన ఈ కామెంట్స్ ను తప్పుబట్టారు అంజన్.

అందరూ సికింద్రాబాద్ ఎంపీ సీటు వద్దనప్పుడు.. తాను పోటీ చేసి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఎవరెవరో వచ్చి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. అజారుద్దీన్ కు చేతనైతే హైద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలన్నారు. నేతల కామెంట్స్, అంజన్ మద్దతుదారుల నినాదాలతో సమావేశంలో గందరగోళంగా మారింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతలకు సర్దిచెప్పారు. అయినా ఎవరికి వారు పోటాపోటీగా నినాదాలు చేయటంతో సమావేశం గందరగోళంగా మారింది.

సికింద్రాబాద్ లో ఎవరూ పోటికి వచ్చినా.. సీటు తనదేనంటున్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. తనకు తాను ప్రకటనలు చేసుకుంటే పార్టీలో నడవదు అంటూ అజారుద్దీన్ కు చురకలు అందించారు. అధిష్టానం ఫైనల్ చేయకుండా, రాష్ట్ర పార్టీ నిర్ణయించుకుండా సికింద్రాబాద్ నుంచి ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. అజారుద్దీన్ కు దమ్ముంటే.. హైదరాబాద్ నుంచి ఒవైసీపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంజన్ కుమార్ యాదవ్ మద్దతుదారులు అజార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పినా వినకపోవటంతో.. మిగతా నేతలందరూ కలుగజేసుకుని అంజన్ మద్దతుదారులను శాంతింపజేశారు. సికింద్రాబాద్ సీటు అంజన్ దే అని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ముఖేష్ గౌడ్ దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశం అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates