కాంగ్రెస్ సభ పెడితే పల్లీలమ్ముకున్నంత మంది రారు.. కేసీఆర్

వనపర్తి : ఉమ్మడి మహబాబ్ నగర్ జిల్లానుద్దేశించి నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ నాయకుల తీరుపై పైరయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు.. గద్వాలకు పోతే… పల్లీలు, బఠానీలు అమ్ముకున్నంత మంది రాలేదన్నారు. కేసీఆర్ బట్టేబాజ్.. దోఖేబాజ్..అని పీసీసీ అధ్యక్షుడు సీఎంను అలా తిట్టొచ్చా అని అడిగారు.

బాగోతంల బుడ్రఖాన్ లు తిప్పినట్టు జానారెడ్డి, నేతలు కత్తులు తిప్పారని అన్నారు. నడి చౌరస్తా సభ పెట్టి కత్తులు తిప్పారని అన్నారు. కత్తులు తిప్పాల్సిన కాడ తిప్పలే కానీ.. తిప్పకూడని కాడ తిప్పారని.. వాళ్ల సంగతి మున్ముందు సభల్లో చెబుతా అన్నారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates