కాంగ్రెస్ హయాంలోనే NRC బిల్లు : అమిత్ షా

నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్ పై కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై అమిత్ షా.. రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1985 లోనే రాజీవ్ గాంధీ.. అసోం NRC ఒప్పంద బిల్లుకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు అమిత్ షా. అది ఇప్పుడు అమలు అవుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో NRCని అమలు చేసే దమ్ము లేకపోయిందని విమర్శించారు. వాళ్లు తెచ్చిన బిల్లును బీజేపీ అమలు చేస్తుంటే తట్టుకోలేక సభలో గందరగోళం సృష్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ఈ బిల్లును వ్యతిరేకించటం అంటే.. రాజీవ్ గాంధీని ఆ పార్టీ వారే వ్యతిరేకించటం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఖరి దేశానికి నష్టం అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.

అమిత్ షా కామెంట్లపై రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. NRC ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఇది మానవ హక్కులకు సంబంధించిన అంశం అన్నారు. హిందూ – ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

Posted in Uncategorized

Latest Updates