కాంగ్రెస్-JDSలది అపవిత్ర కూటమి : అమిత్ షా

AMITH SHAHకాంగ్రెస్-JDSలది అపవిత్ర కూటమి అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. కన్నడ ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని… బీజేపీకి మద్దతు పలికారన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని నిబంధనలకు తుంగలో తొక్కిందని… బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిందని అమిత్ షా ఆరోపించారు. ప్రజల తీర్పులో ఎలాంటి అస్పష్టత లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు మొదటిగా తమకే ఉందన్నారు.

అమిత్ షా కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అమిత్ షాకు రాజ్యాంగం గురిచి ఏమీ తెలియదని… ఒకవేళ తెలిసినా దానిని గౌరవించడంలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చేసి, కాంగ్రెస్-JDS కూటమిని నిలబెట్టిన కాంగ్రెస్ నేత D.K.శివకుమార్, కర్ణాటకలో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరైందని… అందుకే కొన్ని చేదు మాత్రలు మింగాల్సి వచ్చిందన్నారు. ఒక్కోసారి వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండదన్నారు శివకుమార్.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఫేస్ బుక్ పోస్ట్ పార్టీలో దుమారం రేపింది. బలపరీక్ష కోసం తనను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ విడుదలైన ఆడియో టేప్ ఫేక్ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు శివరామ్. ఆడియో టేప్ లో ఉన్నది తన భార్య గొంతు కాదన్నారు. అయితే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే BC పాటిల్ మాత్రం బీజేపీ నేతలు తనకు మంత్రి పదవితో పాటు మరికొన్ని ఆఫర్లు ఇచ్చారన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం కొలువుదీరకముందే అధికార విపక్ష నేతల మధ్య మాటలయుద్దం నడుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates