కాకా TTL టోర్నమెంట్ : కరీంనగర్ పై నల్గోండ విజయం

pPy7GEECVN1517477732Nalgonda-lionsకాకా తెలంగాణ టీ20లో భాగంగా గురువారం (ఫిబ్రవరి-15) జరిగిన మ్యాచ్ లో కరీంనగర్ పై నల్గొండ విక్టరీ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కరీంనగర్ ప్లేయర్లలో షిండే(50), వినీత్ (30), రాహుల్(25) తప్పా..మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. నల్గొండ బౌలర్లలో సురేంధర్ (2) వికెట్లు తీయగా..కార్తికేయ, వరుణ్ గౌడ్, శివుడు తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన నల్గొండ 19.01 ఓవర్లలో 3 వికెట్ల నష్టానిక 160 పరుగులు చేసి విజయం సాధించింది. నల్గొండ ప్లేయర్లలో వరుణ్ గౌడ్ (63), శశిధర్ రెడ్డి (44) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Posted in Uncategorized

Latest Updates