కాకా TTL టోర్నమెంట్ : కరీంనగర్ పై, మెదక్ విజయం

MDKజి. వెంకటస్వామి మెమోరియల్ టీ-20 లీగ్ రౌండ్-3 సక్సెస్ గా సాగుతోంది. జింకాన గ్రౌండ్ లో ఆదిలాబాద్ పై హైదరాబాద్ గెలిచింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఆదిలాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 167 రన్స్ చేసింది. ఆదిలాబాద్ ఓపెనర్ బెంజిమెన్ 42 బాల్స్ లో 45 రన్స్ చేశాడు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ నీరజ్ 29 రన్స్ చేశాడు హైదరాబాద్ బౌలర్ నీలేష్ కు రెండు వికెట్లు దక్కాయి. 168 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 169 రన్స్ చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ జయ్ రామ్ రెడ్డి 23 బాల్స్ లో 53 రన్స్ చేశాడు. దీంతో ఆదిలాబాద్ పై హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆదివారం (ఫిబ్రవరి-18) ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో కరీంనగర్ పై, మెదక్ టీమ్ విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన కరీంనగర్…నిర్ణిత 20 ఓవర్లలో…ఆరు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. ఓపెనర్ వినిత్ డకౌట్ కాగా… ఫస్ట్ డౌన్ లో వచ్చిన రాహుల్ 57 బాల్స్ లో 71 రన్స్ చేశాడు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ వంశిరెడ్డి 40 బాల్స్ లో 54 రన్స్ తో ఆఫ్ సెంచరీ చేశాడు. మెదక్ బౌలర్లలో ప్రణిత్ రాజ్ కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 153 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన మెదక్….కరీంనగర్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ అభిజిత్ రెడ్డి 30 రన్స్ చేయగా మరో ఓపెనర్ మల్లికార్జున్ 34 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన జైస్వాల్ 44 రన్స్ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates