కాకా TTL టోర్నమెంట్ : కరీంనగర్ పై హైదరాబాద్ విక్టరీ

bSue3yWS8g1517477889Thunderboltsవెంకటస్వామి తెలంగాణ టీ20 లీగ్ మూడో రౌండ్ మ్యాచ్ లు ఉత్సాహంగా జరుగుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి-20) జింఖానా గ్రౌండ్ లో కరీంనగర్ వారియర్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో .. హైదరాబాద్ టీమ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 64 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ టీమ్…  6 ఓవర్ల 5 బంతుల్లోనే మ్యాచ్ ను ముగించింది.

వికెట్ నష్టానికి 68 పరుగులు కొట్టింది. ఓపెనర్ చైతన్య 20 బాల్స్ లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 రన్స్ కొట్టి నాటౌట్ గా నిలిచాడు.  తక్కువ పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసిన విఠల్ అనురాగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మహబూబ్ నగర్ పై ఖమ్మం విజయం

ఉప్పల్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్ లో MLR రాయల్స్ మహబూబ్ నగర్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఖమ్మం టీరా గెలిచింది. 126 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఖమ్మం టీరా జట్టు.. 16 ఓవర్ల 3 బంతుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. రెండు వికెట్లు కోల్పోయి 128 రన్స్ కొట్టింది. ఓపెనర్ జునైద్ అలీ 40 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సర్ తో 36 రన్స్ కొట్టాడు. మరో బ్యాట్ మన్ ముఖేష్ గిల్డా 15 బాల్స్ లోనే.. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 రన్స్ చేశాడు.  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ముఖేష్ గిల్డాకు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates