కాకా TTL టోర్నమెంట్: కరీంనగర్ పై రంగారెడ్డి రైజర్స్ విక్టరీ

rr
ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కరీంనగర్ వారియర్స్ పై రంగారెడ్డి రైజర్స్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కరీంనగర్ జట్టు మొదట ఫీల్డింగ్ తీసుకుంది. రంగారెడ్డి రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి…. 171 పరుగులు కొట్టింది. ఓపెనర్ ప్రతీక్ పవార్ 29 బాల్స్ లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 48 రన్స్ చేసి ఔటయ్యాడు. తర్వాత వినయ్ గౌడ్ 37 బాల్స్ లోనే 5 ఫోర్లు, 2 సిక్సులతో 59 రన్స్ చేశాడు. కరీంనగర్ వారియర్స్ జట్టులో బుద్ది రాహుల్ 2 వికెట్లు తీయగా… అన్వేష్, షానవాజ్ ఖాన్, శ్రీకరణ్ తలో వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 రన్స్ మాత్రమే చేసింది.

Posted in Uncategorized

Latest Updates