కాకా TTL టోర్నమెంట్: కాకతీయ కింగ్స్ పై ఖమ్మం టిరా విజయం

khammam
వెంకటస్వామి  తెలంగాణ టీ20  లీగ్ మూడో   రౌండ్ మ్యాచ్ లు  ఉత్సాహంగా  జరుగుతున్నాయి. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన మ్యాచ్ లో కాకతీయ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో… ఖమ్మం టిరా జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఖమ్మం టిరా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కాకతీయ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. యతిన్ రెడ్డి 40 బాల్స్ లోనే 2 సిక్సులు, 7 ఫోర్లతో 66 రన్స్ చేసి ఔటయ్యాడు. చరన్ తేజ 43 రన్స్ చేశాడు. ఖమ్మం బౌలర్లలో జునైద్ 2, త్రిషాంక్ 2  వికెట్లు పడగొట్టారు. తర్వాత చేజింగ్ లో ఖమ్మం ప్లేయర్లు దూకుడుగా ఆడారు. 13 పాయింట్ 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ సాయి కుమార్ 37 బాల్స్ లోనే 7 సిక్స్ లు, 7 ఫోర్లతో 82 రన్స్ చేసి ఔటయ్యాడు. జునైద్ అలీ 20, అజహర్ అలీ 33, ముకేశ్ 17 రన్స్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates