కాకా TTL టోర్నమెంట్ : కాకతీయ కింగ్స్ పై ఆదిలాబాద్ టైగర్స్ విక్టరీ

VVవెంకటస్వామి తెలంగాణ టీట్వంటీ లీగ్ రెండో రౌండ్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి-11)న జరిగిన మ్యాచ్ లో కాకతీయ కింగ్స్ పై ఆదిలాబాద్ టైగర్స్ ఘన విజయం సాధించింది. ఛేజింగ్ లో చేతులెత్తేసిన కాకతీయ కింగ్స్ పై.. ఆదిలాబాద్ జట్టు 124 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆదిలాబాద్ కింగ్స్.. 20 4 వికెట్లు నష్టపోయి 183 పరుగుల భారీ స్కోరు చేసింది. గెలుపు కోసం 184 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కాకతీయ కింగ్స్.. ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. హిమాలయ్ అగర్వాల్ 15.. చరణ్ తేజ 14 పరుగులు మినహా.. మరెవరూ డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు. 59 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆదిలాబాద్ బౌలర్లలో.. కరణ్ కణ్నన్ 4.. సాధన్ రెడ్డి 2.. అనిరుధ్, హితేష్ యాదవ్, రాకేష్ గౌడ్ చెరో వికెట్ సాధించారు. కరణ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates