కాకా TTL టోర్నమెంట్ : నిజామాబాద్ పై నల్గొండ విక్టరీ

LNLకాకా తెలంగాణ టీ20లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి-16) నిజామాబాద్ పై జరిగిన మ్యాచ్ లో నల్గొండ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ 18.03 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. నల్గొండ బౌలర్లలో సురేందర్(3), వంశీరెడ్డి(2), కార్తికేయ (2)  వికెట్లు తీయగా..ఆశిష్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది.. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన నల్గొండ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  114 పరుగులు చేసి, విజయం సాధించింది. నల్గొండ ప్లేయర్లలో సుమంత్ (48), వరుణ్ గౌడ్ (30) పరుగులతో రాణించారు.

Posted in Uncategorized

Latest Updates