కాకా TTL టోర్నమెంట్ : నిజామాబాద్ పై రంగారెడ్డి విజయం

ED-100218-TTLRANGAREDDY-WINవెంకటస్వామి తెలంగాణ టీట్వంటీ లీగ్ రెండో రౌండ్ లో భాగంగా… శనివారం(ఫిబ్రవరి-10) సిద్దిపేటలో జరిగిన మ్యాచ్ లో నిజామాబాద్ పై రంగారెడ్డి విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన రంగారెడ్డి…నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రతీక్ 30 బాల్స్ లో 41 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ హీరో అఖిల్ మరోసారి నిరాశ పరిచాడు. సింగిల్ రన్ కే పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన సోహెల్… 43 బాల్స్ లో 7 ఫోర్లు 3 సిక్సులతో 65 రన్స్ చేసి టాస్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో వచ్చిన సూర్య తేజ 21 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. నిజామాబాద్ బౌలర్లలో శ్రావణ్ కుమార్ రెండు వికెట్ల తీయగా… ప్రసాద్, ప్రనీత్ రెడ్డికి చేరో వికెట్ దక్కాయి.

164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నిజామాబాద్ 9 వికెట్ల నష్టానికి కేవలం 150 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్ సూరజ్ నాయక్ 46 రన్స్ చేయగా… రాహుల్ సింగ్ 23 రన్స్ చేశారు. మిడిలార్డర్ లో వచ్చిన వంశీ కృష్ణ 22 పరుగులు చేశాడు. అయితే చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రంగారెడ్డి బౌలర్లలో అశీస్ కు నాలుగు వికెట్లు దక్కాయి.

Posted in Uncategorized

Latest Updates