కాకా TTL టోర్నమెంట్ ఫైనల్: ఆదిలాబాద్ VS మెదక్

kkakaవెంకటస్వామి తెలంగాణ టీ20 లీగ్ లో సంచలనాలు నమోదయ్యాయి. మెదక్, ఆదిలాబాద్ జట్లు ఫైనల్స్ చేరుకున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ సెమీస్ మ్యాచ్ లో హైదరాబాద్ శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మెదక్ మెవరిక్స్. 151 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన మెదక్ టీమ్.. 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ఓపెనర్ అభిరత్ రెడ్డి మ్యాచ్ ను ఒంటి చేత్తుతో గెలిపించాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 84 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. మల్లిఖార్జున్ 31, జైస్వాల్ 11, సందీప్ 5, చైతన్య కృష్ణ 3, గణేష్ 10 పరుగులు చేశారు. అభిరత్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్… 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 150రన్స్ చేసింది. KSK చైతన్య 43, ప్రిన్స్ 27, చందన్ సహానీ 31, జయరామ్ రెడ్డి 25 రన్స్ చేశారు. మెదక్ బౌలర్లలో ప్రణీత్ రాజ్, చైతన్య కృష్ణ, జైస్వాల్ తలో రెండు వికెట్లు తీశారు. సందీప్ ఒక వికెట్ పడగొట్టాడు.

సెకండ్ సెమీస్ లో రంగారెడ్డి రైజర్స్ పై 16పరుగుల తేడాతో గెలిచింది ఆదిలాబాద్ టైగర్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్… 20 ఓవర్లలో 7వికెట్లకు 182 రన్స్ చేసింది. రవి తేజ 24, జావీద్ అలీ 45, నీరజ్ బిస్త్ 40, హేమ తేజ 40 పరుగులు చేశారు. రంగారెడ్డి బౌలర్లలో పృద్వీ, రాధాకృష్ణ చెరో 2వికెట్లు తీశారు.

183 రన్స్ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన రంగారెడ్డి 19.2ఓవర్లలో 166పరుగులకు ఆలౌట్ అయింది. అక్షత్ రెడ్డి 81 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ లో దీపాన్ష్ 11, అక్కినేని అఖిల్ 15, సొహైల్ 20, వినయ్ 15 రన్స్ చేశారు. ఆదిలాబాద్ బౌలర్లలో రవితేజ, కరణ్, రాకేష్ తలో రెండు వికెట్లు తీయగా… హితేష్, సాధన్, నీరజ్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. జావీద్ అలీకి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

రేపు(ఆదివారం,ఫిబ్రవరి-25) TTL ఫైనల్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ను గ్రాండ్ గా నిర్వహిస్తామన్నారు HCA అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి.

Posted in Uncategorized

Latest Updates