కాకా TTL టోర్నమెంట్: ఫైనల్ కి చేరిన మెదక్ మేవరిక్స్ టీం

medakజి.వెంకటస్వామి తెలంగాణ టీ20 లీగ్ లో మెదక్ మేవరిక్స్ టీమ్ ఫైనల్ చేరింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన సెమీస్ మ్యాచ్ లో హైదరాబాద్ శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 151 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన మెదక్ టీమ్.. 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 రన్స్ చేసింది. ఓపెనర్ అభిరత్ రెడ్డి మ్యాచ్ ను ఒంటి చేత్తుతో గెలిపించాడు. 54 బాల్స్ లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 84 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ మల్లిఖార్జున్ 31 రన్స్ చేశాడు.  84 రన్స్ చేసిన మెదక్ బ్యాట్స్ మన్ అభిరత్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates