కాకా TTL టోర్నమెంట్: రంగారెడ్డి పై హైదరాబాద్ విక్టరీ

Hyderabad-Sreenidhian-vs-Rangareddy-Risersవెంకటస్వామి తెలంగాణ టీ20 లీగ్ మూడో రౌండ్ మ్యాచ్ లు జోరుగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సోమవారం(ఫిబ్రవరి-19) జరిగిన మ్యాచ్ లో రంగారెడ్డి రైజర్స్ జట్టుపై..  హైదరాబాద్ శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ టీమ్ 17 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్ టీమ్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  190 పరుగులు చేసింది. ఓపెనర్ చైతన్య 41 బాల్స్ లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో 63 రన్స్ కొట్టాడు. మరో బ్యాట్స్ మన్ చందన్ సహానీ  49 బాల్స్ లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 86 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 191 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్ టీమ్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 173 రన్స్ మాత్రమే చేసింది.

రంగారెడ్డి జట్టులో ప్రతీక్ పవార్ ఒంటరి పోరాటం చేశాడు. 53 బాల్స్ లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 85 రన్స్ కొట్టాడు. మిగితా బ్యాట్స్ మెన్స్ ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 17 రన్స్ తేడాతో హైదరాబాద్ శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ టీమ్ విజయం సాధించింది. హైదరాబాద్ టీమ్ లో 86 రన్స్ చేసిన చందన్ సహానీ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Hyderabad Sreenidhian vs Rangareddy Risers LIVE | G Venkataswamy Memorial Telangana T-20 League

Hyderabad Sreenidhian vs Rangareddy Risers LIVE | G Venkataswamy Memorial Telangana T-20 League

V6 News 发布于 2018年2月18日周日

Posted in Uncategorized

Latest Updates