కాకా TTL టోర్నమెంట్ : వరంగల్ పై మెదక్ విక్టరీ

MEDAKవెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ టీ-20 లీగ్.. రౌండ్-3 మ్యాచ్ లు గురువారం (ఫిబ్రవరి-15) గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. MLR  కాలేజ్ గ్రౌండ్స్ లో వరంగల్ కాకతీయ కింగ్స్ పై మెదక్ మెవరిక్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 43 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన మెదక్ రెండు వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది. ఓపెనర్ అభిరత్ రెడ్డి 27 రన్స్ చేసి ఔటవ్వగా…మరో ఓపెనర్ మల్లికార్జున్ సెంచరీ చేశాడు.

52 బాల్స్ 9 సిక్సులు…8 ఫోర్లతో 110 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో లీగ్ లో ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు మల్లికార్జున్. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన జైశ్వాల్ 39 బాల్స్ లో 5 ఫోర్లు ఆరు సిక్సులతో 81 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. చివర్లో సంతోష్ ఏడు బాల్స్ లో 12 రన్స్ చేశాడు. దీంతో మెదక్ మెవరిక్స్ నిర్ణిత 20 ఓవర్లలో 234 రన్స్ చేసింది.

235 పరుగుల భారీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన వరంగల్ కాకతీయ కింగ్స్….చివరివరకు పోరాడి ఓడింది. ఓపెనర్ చరణ్ తేజ్ 13 రన్స్ చేసి నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ 22 బాల్స్ లో 4 సిక్సులు…ఐదు ఫోర్లతో 49 రన్స్ చేశాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన చైతన్య రెడ్డి 14, యతిన్ రెడ్డి 46 సుకాంత్ 22, మీరజ్ 21 రన్స్ చేశారు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో కాకతీయ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 191 రన్స్ మాత్రమే చేసింది.  మెదక్ బౌలర్లలో భరత్, చైతన్య కుమార్ లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. జైస్వాల్, సంతోష్ గౌడ్ లు చెరో వికెట్ తీశారు. లీగ్ లో ఫస్ట్ సెంచరీ నమోదు చేసిన మల్లికార్జున్ కు మ్యాన్ ఆఫ్ దీ మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Posted in Uncategorized

Latest Updates