కాకుల కోసం స్పెషల్ పార్క్

మధ్యప్రదేశ్ లో తొలిసారిగా కాకుల కోసం ఓ పార్క్ ఏర్పాటైంది. అంతరించిపోతున్న కాకులను కాపాడేందుకు మధ్యప్రదేశ్ లోని విదిశలో.. ముక్తిధామ్ సేవా సమితి అనే ఓ ఆర్గనైజేషన్ ఈ పార్క్ ని ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ సెక్రటరీ మాట్లాడుతూ….కాకులను రక్షించేందుకే పార్క్ ని ప్రారంభించినట్లు తెలిపారు. వాటిని కాపాడేందుకు కృషి చేస్తున్న మేమందరం  పూర్వీకుల ఆశీస్సులు పొందుతామని భావిస్తున్నట్లు తెలిపారు.  విజ్ఞాన శాస్త్రం, మతపరంగానూ కాకులకు ప్రత్యేక విశిష్టత ఉందని తెలిపారు. ఈ పార్క్ లో కాకులకు ఫుడ్, వాటర్ కొరత లేకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాకులను హిందూ మతం ప్రకారం పూర్వీకులుగా భావిస్తారని…వాటిని పోషించడం గొప్ప ధర్మకార్యంగా’ భావిస్తున్నట్లు విదిశ మున్సిపల్ కౌన్సిలర్ దినేశ్ కుశ్వాహ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates