కాగ్ రిపోర్ట్ : వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ నెం.1

CAG Sకంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రిపోర్ట్ లో వృద్ధిరేటు దేశంలోనే తెలంగాణ  టాప్ లో నిలిచింది. దీనిపై సీఎం కేసీఆర్ హర్ణం వ్యక్తం చేశారు.  నాలుగేళ్లలో రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు దేశంలోనే తొలి స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ తొలి స్థానంలో ఉన్నట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రకటించిందని సీఎం తెలిపారు.

2014 జూన్ నుంచి 2018 మే వరకు వివరాలను కాగ్ ప్రకటించిందన్న కేసీఆర్.. 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో అగ్రస్థానంలో నిలిచామన్నారు. రాష్ట్ర స్వీయ ఆదాయం మిగతా రాష్ర్టాల కంటే ముందంజలో ఉందని తెలిపారు. మిగతా రాష్ర్టాలన్నీ 10 శాతంలోపు వృద్ధిరేటు సాధించాయని… ఆర్థిక క్రమ శిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.  నోట్ల రద్దు, GST వంటి నిర్ణయాల తర్వాత కూడా స్థిరమైన వృద్ధి సాధించామని తెలిపారు సీఎం కేసీఆర్.

ఆదాయ వృద్ధి రేటులో తొలి ఐదు రాష్ట్రాలు ఇవే..

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కాగ్‌ వెల్లడించింది. రాష్ట్రాలకు సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏడాది నమోదైన ఆదాయ వృద్ధిని వెబ్‌ సైట్‌ లో పొందుపరిచింది. దీని ప్రకారం 2014 జూన్‌ నుంచి 2018 మే వరకు రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్లను సోమవారం (జూన్-25) ప్రకటించారు. గత నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం17.2 శాతం వృద్ధి రేటు సాధించి, దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది కాగ్. 14.2 శాతంతో హరియాణా రెండో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర మూడు, ఒడిశా నాలుగో స్థానంలో, పశ్చిమ్‌ బంగ ఐదో స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాలు మాత్రమే 10 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేశాయని తెలిపింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో వృద్ధిరేటు తక్కువగా నమోదైనట్టు తెలిపింది కాగ్. తెలంగాణలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వృద్ధిరేటు సాధించగా.. 2016-17లో 21.1 వృద్ధిరేటు నమోదైంది. 2017-18లో 16.8శాతం వృద్ధిరేటు లభించింది. ఈ నాలుగేళ్లలో సగటున 17.2 వృద్ధిరేటుతో రాష్ట్రం ముందంజలో నిలిచింది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates