కాటసాని ఇంట్లో విషాదం : మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య

katasaniకర్నూలు జిల్లాలో పేరొందిన కుటుంబం కాటసానిది. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 14వ తేదీ గురువారం అర్థరాత్రి బనగానపల్లెలోని ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. నాగార్జునరెడ్డి హైదరాబాద్ లో పీజీ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి బనగానపల్లె ఇంటికి వచ్చాడు. ఏమైందో ఏమోగానీ.. అర్థరాత్రి తర్వాత తన గదిలోకి వెళ్లి ఊపిరి తీసుకున్నాడు.

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో కాటసాని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆత్మహత్య చేసుకున్న నాగార్జునరెడ్డి పెదనాన్నే.. కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం నియోజకవర్గం నుంచి వరసగా ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఆయనది. నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా బామ్మర్ది నాగార్జునరెడ్డి కావటం విశేషం. తన రాజకీయ వారసుడు నా పెద్ద కుమారుడే అంటూ అందరికీ చెబుతుండేవారు కాటసాని రామిరెడ్డి. ఇలాంటి సమయంలో ఇంటి పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకోవటం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది.

Posted in Uncategorized

Latest Updates