కాటేదాన్ ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం: లక్షల్లో ఆస్తి నష్టం

హైదరాబాద్ శివారులోని కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో శుక్రవారం (జూలై-27)  అగ్రిప్రమాదం జరిగింది. పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉండటంతో.. దట్టమైన పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. కాటేదాన్ లో గత కొన్ని రోజులుగా ఫారూక్ అనే వ్యక్తి.. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి.. ప్లాస్టిక్ దాణా వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం సమయంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు అంటుకొని పూర్తిగా ప్లాస్టిక్ కాలిపోయింది. దీంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది.

Posted in Uncategorized

Latest Updates