కానరాని డయాలసిస్ సేవలు..ఇబ్బందుల్లో కిడ్నీ బాధితులు

Dialysis-Machineసత్తుపల్లి  హాస్పిటల్ లో  నెల రోజులు  గడిచినా  డయాలసిస్  సేవలు  అందుబాటులోకి  రాలేదు. రాష్ట్రమంత్రులు  తుమ్మల, లక్ష్మారెడ్డి  ప్రారంభించిన  డయాలసిస్ సెంటర్  ఇంకా రోగులకు  సేవలు అందించడం  లేదు. దాంతో  కిడ్నీ బాధితులు  తీవ్ర అవస్థలు  పడుతున్నారు.

సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పటల్ లో డయాలిసిస్ సెంటర్ ప్రారంభించి నెల రోజులైంది. అయినా ఇప్పటివరకు డయాలిసిస్ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. వందలాది మంది కిడ్నీ రోగులు ప్రైవేట్ హాస్పిటళ్లలో వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఒక్కసారి డయాలసిస్ చేయించుకుంటే 15నుంచి 20 వేలు ఖర్చవుతుందని చెబుతున్నారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

సత్తుపల్లి ఏరియా హాస్పిటల్ లో ఐదు యూనిట్ల సామర్ధ్యం కలిగిన డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. వీటితో రోజుకు 15 నుంచి 20 మందికి డయాలసిస్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ  డయాలిసిస్ సెంటర్ మూడు షిఫ్టులుగా విభజించి నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఒక్కో షిఫ్టుకు ముగ్గురు టెక్నీషియన్లు ఒక స్టాఫ్ నర్స్, ఒక సూపర్ వైజర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించారు.

లేటెస్ట్ టెక్నాలజీతో  ఐదు డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ డయాలిసిస్ లో శుధ్ది జలం అందించేందుకు అత్యాధునిక ఫిల్టర్, నీటిని నిల్వ చేసే ఆర్వో ప్లాంట్ కూడా ఉంది. అంతా బాగానే ఉన్నా… డయాలసిస్ సేవలు ప్రారంభించేందుకు అంతర్గత డ్రైయినేజి లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. డయాలసిస్ కేంద్రం నుంచి వచ్చే వృథా నీరు బయటికి పోకపోవడంతో… వేస్ట్ వాటర్ తో డయాలిసిస్ సెటర్లోకి దుర్గంధం వస్తుంది. అధికారులు వెంటనే వసతులు కల్పించి.. డయాలసిస్ సేవలు ప్రారంభించాలంటున్నారు కిడ్నీ రోగులు.

Posted in Uncategorized

Latest Updates