కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు రిలీజ్

కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ ను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఆదివారం(అక్టోబర్ 14) రిలీజ్ చేసింది. 4,49,650 ఎగ్జామ్ కు హాజరు కాగా 2,28,865(50.90 శాతం) మంది క్వాలి ఫై అయ్యారు. వీరిలో మహిళలు 49.36, పురుషులు 51.21 శాతం ఉన్నారు. మే 31న 16,925 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా 4,79,158 మంది అప్లై చేశారు.

సెప్టెంబర్.30న రాష్ర్ట వ్యాప్తంగా 966 సెంటర్లలో ఎగ్జామ్ జరిగింది. ఈ నెల 5న ప్రాథమిక కీ రిలీజ్ చేసిన బోర్డు.. అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీ తో పాటు ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. సిలబస్ తో సంబంధం లేని 9 ప్రశ్నలను తొలగించి, అందరికీ మార్కులు ఇచ్చింది. ఒక ప్రశ్నకు ఏ ఆన్సర్ పెట్టినా కరెక్ట్ ఆన్సర్ గా పరిగణిస్తామని బోర్డు చెప్పింది. దీంతో ప్రతీ అభ్యర్ధికి పది మార్కులు అదనంగా వచ్చాయి. ఫిజికల్ టెస్ట్  తేదీలను త్వరలో వెబ్ సైట్ లో పెడతామని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates