కాపాడాలంటూ గంటపాటు వేడుకోలు : ఫెరారీ కారు యాక్సిడెంట్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి

FERఆదివారం(జూన్-3) హౌరా సిటీకి 25 కిలోమీటర్ల దూరంలోని NH-6 పై దోమ్జుర్ దగ్గర ప్రముఖ వ్యాపారవేత్త శివాజీ రాయ్ 3.13 కోట్లు విలువైన ఫెరారీ కాలిఫోర్నియా T కారులో ప్రయాణిస్తూ పకురియా ఫ్లై ఓవర్ పై జరిగిన యాకోసిడెంట్ లో చనిపోయాడు. ఎదురుగా వెళ్తున్న ఓ లారీ ట్రక్కు సడన్ గా స్లో అవడంతో కారుని దానికి తగలకుండా తప్పించే క్రమంలో  బ్రిడ్జిని ఢీ కొట్టిన తర్వాత.. ఓ ఐరన్ రాడ్ కారు ఇంజిన్ ను ఢీకొట్టి డ్రైవర్ సీటులో ఉన్న శివాజీ రాయ్ ఛాతీలోకి దిగబడింది. ఎయిర్ బాగ్స్ ఉన్నప్పటికీ చావుని తప్పించలేకపోయారు. ప్రమాద సమయంలో కారు స్పీడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఉంది. M.L రాయ్ అండ్ CO శానిటేషన్స్ ఫ్రైవేట్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. బెంగాల్ లోని ప్రముఖమైన, పురాతనమైన కంపెనీల్లో ఇది ఒకటి.

కల్ కతా నుంచి క్లబ్ GTI కార్యక్రమంలో భాగంగా ఏడుగురు వాహనదారులు తమ కుటుంబాలతో కలసి ఆదివారం ఉదయం NH-6పై ఏడు కార్లలో లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. తన కారుని కాకుండా తన ఫ్రైండ్ కారుని డ్రైవ్ కి శివాజీ తీసుకెళ్లారు. కారులో శివాజీతో పాటు అతని కొడుకు శ్రేయన్(17), ఫ్రెండ్ కూతురు ఆషానా సురానా(17) ఉన్నారు. వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత గంట సేపు కారులోంచి బయటకు రాలేక శివాజీ ఏడుస్తూ ఉన్నాడు. అతన్ని కాపాడేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అవ్వటంతో అందులో ఇరుక్కుపోయారు ఆయన. శ్వాస ఆడటం లేదని.. బయటకు తీయాలని పదే పదే వేడుకున్నాడని అతని మిత్రులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశాం అని.. అయినా కారు భాగాలను తొలగించటం సాధ్యం కాలేదన్నారు. బయటకు తీసుకురావటానికి గంట సమయం పట్టిందన్నారు అతడి ఫ్రెండ్ ప్రవీణ్ అగర్వాల్ తెలిపారు. కళ్లదుట స్నేహితుడు కాపాడాలని వేడుకుంటుంటే ఏమీ చేయలేని నిశ్సాహాయ స్థితిలో ఉన్నాం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అగర్వాల్.

Posted in Uncategorized

Latest Updates