కాప్ కనెక్ట్ యాప్ : ఒక్క క్లిక్ తో పోలీసులందరికీ సమాచారం

COP APPఒకేసారి లక్ష మందికి SMS, ఆడియో, వీడియోల్ని పంపించేలా.. కాప్ కనెక్ట్ యాప్ ను రూపొందించింది రాష్ట్ర పోలీస్ శాఖ. పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందన్నారు DGP మహేందర్ రెడ్డి. పోలీసుల కోసం ప్రత్యేకంగా సోమవారం (జూన్-18) డీజీపీ ఆఫీసులో కాప్ కనెక్ట్ అనే యాప్ ను విడుదల చేశారు DGP మహేందర్ రెడ్డి. డిపార్ట్ మెంట్ లోని 63 వేల మందికి ఒకేసారి కమ్యూనికేషన్ చేసేలా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఒకేసారి వెయ్యి చోట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ చేసే వీలుందన్నారు.

సేఫ్టీ, అండ్ సెక్యూరిటీలో భాగంగా ఈ యాప్ తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణ పోలీస్ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన టెక్నాలజీను ప్రవేశపెడుతోందని తెలిపిన డీజీపీ.. నేరస్థులను పట్టుకునేందుకు ఈ యప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రూప్ కాలింగ్, లొకేషన్  సిగ్నల్ ఆధారంగా నేరస్థులను పట్టుకునేందుకు సులువుగా ఉంటుందన్నారు. పోలీసులు వారి స్పెషల్ పాస్ వర్డ్ లతో లాగిన్ కావాల్సి ఉంటుందని, అవసరానికి తగ్గుట్టుగా ఆప్షన్లు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యాప్ ద్వారా రానున్న రోజుల్లో నేరస్థులను పట్టుకోవడం గంటల్లోనే జరిగిపోతుందన్నారు.

ఇన్ఫర్మేషన్ ను పోలీస్ గ్రూప్ లో షేర్ చేసుకుంటారని, దీని ద్వారా కమ్యునికేషన్ మరింత ఈజీ అవుతుందని తెలిపారు DGP. తెలంగాణలోని 638 పోలీస్ స్టేషన్ లో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు జరిపేందుకు టెక్నాలజీని తీసుకువస్తున్నామని తెలిపారు.  రిజస్టర్ అయిన పోలీసుల మొబైల్స్ లకు లింక్ ఉంటుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులు ఇందులోకి ఎంటర్ కాకుండా సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు DGP మహేందర్ రెడ్డి.

 

Posted in Uncategorized

Latest Updates