కామన్వెల్త్‌ గేమ్స్ : భారత్ కు మరో స్వర్ణం

Manika-Batraకామన్వెల్త్‌ గేమ్స్ లో నాలుగో రోజు భారత్‌ పంట పండింది. టేబుల్‌ టెన్నిస్‌(టీటీ)లో మానికా బత్రా అండ్‌ కో స్వర్ణం సాధించింది. టీమ్‌ ఈవెంట్‌లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-8) ఢిపెండింగ్‌ చాంపియన్‌ సింగపూర్‌తో జరిగిన ఫైనల్లో భారత్‌ 3-1 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ స్వర్ణం గెలుచుకోవడం ఇదే ఫస్ట్ టైం. దీంతో భారత్‌ స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా పతకాల సంఖ్య పన్నెండుకు చేరింది.

మానికా బత్రా, మౌమా దాస్‌, మాధురికా పట్కార్‌, సుత్రితా ముఖర్జీ, పూజా సహస్రాబుదేలతో కూడిన భారత టీటీ జట్టు.. ఏలిన్‌, వాన్లింగ్‌ జింగ్‌, తియాన్వి,మెన్గ్యూ, యిహాన్‌ జోలతో కూడిన పటిష్టమైన సింగపూర్‌ను మట్టికరిపించింది. అండర్‌ డాగ్‌గా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. అదే ఊపును తుది పోరులో కూడా కొనసాగించిన భారత్‌ ఏకంగా పసిడిని ఖాతాలో వేసుకుఉంది. దాంతో నాలుగో రోజు ఆటలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు దక్కాయి. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం.

Posted in Uncategorized

Latest Updates