కామన్వెల్త్ గేమ్స్‌ లో వెయిట్‌లిఫ్టర్ల జోరు: భారత్‌కు మరో స్వర్ణం

sathishఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత  వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. శనివారం(ఏప్రిల్-7) ఉదయం జరిగిన పోటీల్లో ఇండియా మరో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. పురుషుల 77 కేజీల విభాగంలో మొత్తం 317 కేజీలు ఎత్తి సతీశ్‌కుమార్ శివలింగం స్వర్ణం కైవసం చేసుకున్నాడు. స్నాచ్‌లో 144కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కిలోలు ఎత్తాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రత్యర్థి లిఫ్టర్ జాక్ ఆలీవర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నాడు. అతడు క్లీన్ అండ్ జెర్క్ రౌండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. మూడో రోజు గేమ్స్‌లో భారత్  మూడో బంగారు పతకం సాధించింది. దీంతో మొత్తం భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు వచ్చిన పతకాలన్నీ వెయిట్‌లిఫ్టింగ్‌లోనే వచ్చాయి.

Posted in Uncategorized

Latest Updates