కామన్వెల్త్ గేమ్స్: చిన్న వయసులో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్

ఆస్ట్రేలియా గోల్డ్ కోస్టు లో జరుగుతున్న కామన్వెల్త్ లో భారత ప్లేయర్ల  హవా కొనసాగుతోంది. గోల్డ్ మెడల్స్ ను కొల్లగొడుతున్నారు. ఇందులో భాగంగా షూటర్‌ అనిష్‌ భన్వాలా భారత్‌కు స్వర్ణం తీసుకొచ్చి రికార్డు సాధించాడు. పదిహేనేళ్ల అనిష్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో అత్యంత చిన్న వయసులో భారత్‌కు మెడల్‌ సాధించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. పురుషుల 25మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ విభాగంలో అనిష్‌ శుక్రవారం(ఏప్రిల్-13) గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన సెర్గీ ఎవ్‌గ్లెవ్‌స్కీని వెనక్కి నెట్టి అనిష్‌ అన్ని రౌండ్లలో కలిపి రికార్డు స్థాయిలో 30 పాయింట్లు సంపాదించాడు. సెర్గీ 28 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌కు  చెందిన సామ్‌ గోవిన్‌ 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

Posted in Uncategorized

Latest Updates