కామన్వెల్త్ గేమ్స్ : భారత్‌కు మరో స్వర్ణం

sanjita-chanuఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెండో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఉమెన్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ మళ్లీ స్వర్ణ పతకాన్ని గెలిచింది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్‌  సంజిత ఛాను 192 కేజీ బరువును ఎత్తి, గోల్డ్ మెడల్  సాధించింది. ఛానుకు చేరువలో ఉన్న పాపువా న్యూ గినియా లిఫ్టర్‌ కూడా క్లీన్‌ అండ్‌ జర్క్‌ మూడో అటెంప్ట్‌లో విఫలం కావడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది.

గురువారం(ఏప్రిల్-5) 48 కేజీల వెయిట్ లిప్టింగ్ లో స్నాచ్ విభాగంలో  సోయిఖోమ్ మీరా బాయి ఛాను గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates