కామన్వెల్త్ గేమ్స్: హ్యాట్రిక్ సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్

KUMARఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్ లో భారత రెజర్లు సత్తా చాటుతున్నారు. స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ వరుసగా మూడోసారి కామన్వెల్త్‌లో గోల్డ్ మెడల్ గెలిచి ..హ్యాట్రిక్ సాధించాడు. పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగంలో దక్షిణాఫ్రికా ఆటగాడు జొహాన్నెస్‌ బోతాపై విజయం సాధించిన సుశీల్‌ స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. కేవలం 80 సెకన్లలోనే సుశీల్‌ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో సుశీల్‌ స్వర్ణం సాధించడం ఇది వరుసగా మూడోసారి. 2010లో 66 కేజీల విభాగంలో, 2014లో 74 కేజీల విభాగంలో సుశీల్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates